AP Election 2019 : Chandra Babu Says To Leaders 'Don't Make Negative Comments On Pawan | Oneindia

2019-01-19 846

TDP Chief Chandra Babu directed pary leaders should not do negative comments on Pawan kalyan. Now these indications predicting once again alliance between TDP and pawan.
#ChandraBabu
#Pawankalyan
#janasena
#tdp
#ysjagan

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో టెలి కాన్పిరెన్స్ నిర్వ‌హించారు. అందులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ్యూహాల పై ప‌లు సూచ‌న‌లు చేసారు. అదే స‌మ‌యంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై టిడిపి నేతలు ఎవరూ విమర్శలు చేయవద్దని టిడిపి అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన‌ట్లు వార్తలు స‌మాచారం.నేతల టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ బిజెపి, టిఆర్ఎస్ ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ లపై విమర్శలు చేయాలని , ఆంద్రాకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఉందని ద్వేష ప్రచారం చేయాలని ఆయన సూచించారు. అదే స‌మ‌యంలో సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించార‌ని తెలుస్తోంది. బుచ్చ‌య్య చౌద‌రి జోక్యం చేసుకొని ప‌వ‌న్ ను కూడా విమర్శించాలి కదా అని అన‌టంతోనే..చంద్రబాబు ఆగ్రహం తెచ్చుకుని తాను చెప్పింది చేయాలని ఆదేశించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గా స‌మాచారం. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ త‌మ‌తో క‌లిసి రావా ల‌ని ముఖ్య‌మంత్రి ఆహ్వానించారు. అయితే, ప‌వ‌న్ ఆహ్వానాన్ని తిరస్క‌రించారు.